మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్
భద్రాచలం,నవంబర్28 వై 7 న్యూస్;
భద్రాచలంలో గురువారం అశోక్ నగర్ కాలనీలో మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి దాసరి శేఖర్ మాట్లాడుతూ, భద్రాచలంలో ఉన్న ప్రతి మాల కుటుంబం డిసెంబర్ ఒకటో తారీఖున హైదరాబాదులో జరిగే మాలల సింహ గర్జన సభకు హాజరై జయప్రదం చేయాలని భద్రాచలంలో ఉన్న ప్రతి గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సినిగిరి చిట్టిబాబు, రవి దాసు మారతా సీతామహాలక్ష్మి కుమారి పాపయ్య రమేష్ బేబీ ప్రసన్న కుమార్ దేవరాజ్ రాజు తదితరులు పాల్గొన్నారు
Post Views: 113









