E-PAPER

భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు,నవంబర్19 వై 7 న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మంగళవారం క్యాంపు కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం. పాయం మాట్లాడుతూ ఇందిరా గాంధీ భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారని , ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసిన ఒక మహా నాయకురాలని భారతదేశ ప్రధానిగా దేశ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన ఒక మహా నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారని ఇందిరా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కొన్ని రోజుల్లో ఇందిరా గాంధీ పేరుతో ఇందిరమ్మ ఇళ్ళను పేద ప్రజలకు అందజేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఎవరైనా పాల్పడితే సహించేది లేదని ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎవరైనా మోసాలకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ ,పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం , మణుగూరు సింగరేణి ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య , అనుబంధ సంఘాల నాయకులు ,మహిళా నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News