హైదరాబాద్,నవంబర్19 వై 7 న్యూస్
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (ఆంగ్లం:International Men’s Day లేదా IMD) ప్రతి సంవత్సరం నవంబరు 19 న అంతర్జాతీయా స్థాయిలో జరుపబడే ఉత్సవం.1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ చే ఈ దినము ప్రారంభించబడిననూ, ట్రినిడాడ్ , టొబాగో దేశస్థులు దీనికి కొత్త ఊపిరులు ఊదారు.దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుండి క్రమం తప్పక జరుపుతున్నారు. ఈ ఉత్సవాన్ని సుదీర్ఘ కాలంగా జరుపుతున్నది మాల్టా వారే. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ , టొబాగోలో 1999 లో ప్రారంభించబడింది.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి
ఆస్ట్రేలియా,ఉత్తర అమెరికా,క్యారిబియన్ దీవులు,ఆసియా,ఐరోపా ,ఆఫ్రికా ల నుండి పలు వ్యక్తులు, సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. యునెస్కో యొక్క స్త్రీ , శాంతికాముక సంస్కృతి విభాగ నిర్దేశకురాలు ఇంగెబోర్గ్ బ్రెయ్నెస్ ఈ దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ
“This is an excellent idea and would give some gender balance.
(ఈ దినోత్సవం లింగ సమానతను అలవర్చే ఒక అద్భుతమైన ఆలోచన.)”
అని వ్యాఖ్యానించింది. దీని నిర్వాహకులకు సహాయ సహకారాలను అందించటానికై యునెస్కో ఎదురు చూస్తూ ఉంటుందని తెలిపినది.
అప్పటికే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపబడుతుండటం పితృ దినోత్సవం జరుపుబడుతున్ననూ, తండ్రికాని పురుషులకంటూ ఒక దినోత్సవం లేకపోవటం, ఈ దినోత్సవ ఆలోచనకు దారి తీశాయి.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం నేపథ్యంలో గల ప్రాథమిక లక్ష్యాలు:
ఆదర్శ పురుషుల గురించి ప్రత్యేకించి తెలుపటం
కేవలం సినిమా తారలనో, క్రీడాకారులనో మాత్రమే కాక, దైనందిన జీవితంలో కాయకష్టం చేసుకునైనా సరే గౌరవప్రదమైన నిజాయితీపరమైన జీవితాలు గడిపేవారి గురించి కూడా చెప్పటం
సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకు, శిశు సంరక్షణకు , పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలను గుర్తించటం పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక , ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి సారించటం సాంఘిక సేవలలో, విలువలలో, అంచనాలలో , చట్టాలలో పురుషులేదుర్కొంటూన్న వివక్షను చాటటం
స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పటం
లింగ సమానత్వాన్ని వ్యాపింపజేయటం
హాని గురించిన తలంపులు లేని, పరిపూర్ణ అభివృద్ధికి అవకాశాన్నిచ్చే సురక్షితమైన ప్రపంచం రూపొందించటానికి కృషి చేయటం ఇవే కాక సంఘంలో పురుషులు/బాలురు ఎదుర్కొనే వివక్షను పురుషజాతికి,సంఘం పట్ల,కుటుంబం పట్ల,వివాహం పట్ల
శిశు సంరక్షణ పట్ల గల సత్సంకల్పము, ఆయా దిశలలో పురుషజాతి సల్పే కృషి, వీటి వలన పురుషజాతికి కలిగే సాధకబాధకాలను విశదీకరించే సందర్భమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవము. స్థూలంగా ఈ దినోత్సవం యొక్క విశాల , అంతిమ ధ్యేయం ప్రాథమిక మానవీయ విలువలను పెంపొందించటం.
19 నవంబరున ఈ ఉత్సవాన్ని 70కి పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి.