సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన జీవీ ఆంజనేయులు
అమరావతి నవంబర్ 13 వై7 న్యూస్;
ముఖ్యమంత్రి చంద్రబాబు చీఫ్ విప్‌గా తనకు అప్పగించిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహించి చూపుతానని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. తనపై ఎంతో నమ్మకంతో కీలకమైన బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ విప్‌గా అసెంబ్లీ సజావుగా సాగేందుకు నా బాధ్యతలు నిర్వర్తిస్తా అని, ఈ పదవి ద్వారా కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందని సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి చీఫ్ విప్ నియామకంపై అధికారికంగా ప్రకటన వచ్చిన అనంతరం ఈ మేరకు మీడియాతో మాట్లాడా రు జీవీ ఆంజనేయులు. ఇదే సందర్భంగా తెలుగుదేశం పార్టీలో తనతో పాటు విప్‌లుగా పదవులు అందుకున్న బెందాళం అశోక్, బోండా ఉమా, దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, థామస్, తోయక జగదీశ్వరి, కాలవ శ్రీనివాసులు, రెడ్డప్పగారి మాధవీ రెడ్డి, గణబాబు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు, జనసేన అసెంబ్లీ విప్ లుగా నియమితులైన ఆరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, బీజేపీ నుంచి విప్‌గా ఎంపికైన ఆదినారాయణ రెడ్డిలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అలానే శాసనమండలి శాసనమండలి చీఫ్ విప్ గా నియమితులైన పంచుమర్తి అనురాధ, విప్ లు కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి, జనసేన నుంచి విప్‌గా నియమితులైన హరిప్రసాద్‌కు అభినందనలు తెలియజేశారు జీవీ. అందరం కలిసి కట్టుగా సమన్వయం చేసుకుంటూ చట్టసభల గౌరవం పెంచుతామని మాట ఇచ్చారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ నాయకత్వంలో అందరం కలసి సమిష్టిగా ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా కలిసి పనిచేస్తామన్నారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు .