E-PAPER

పలు వార్డులలో విస్తృతంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

చిలకలూరిపేట,నవంబర్ 13 వై సెవెన్ న్యూస్

చిలకలూరిపేట పట్టణంలో పలు వార్డులలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. పట్టణంలోని 8వ వార్డు మరియు 12,13,25 వార్డులలో ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ప్రతీ ఒక్క ఇంటికీ పార్టీ నేతలు వెళ్లి, సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు.రెండు సంవత్సరాల కాల పరిమితితో కూడిన సదరు సభ్యత్వం పొందిన వారికి ప్రమాద బీమా 5 లక్షల వరకూ ఉంటుంది. ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మాజీ మంత్రి వర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష నిర్వహించి, సభుత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం అయింది.ఈ కార్యక్రమంలో పార్టీ పరీశీలకురాలు శ్రీమతి ఉషారాణి, నెల్లూరి సదాశివరావు, షేక్ కరిముల్లా, s.s.సుభాని, పఠాన్ సమద్ ఖాన్, మద్ధుమాల రవి,ముల్లా కరిముల్లా, మద్దిబొయిన శివ, మురకొండ మల్లి బాబు, గోపిదేశి గంగాధర్, కొత్త కుమారి, చేవూరి కృష్ణ మూర్తి పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :