అశ్వాపురం, అక్టోబర్ 05 వై సెవెన్ న్యూస్;
అశ్వాపురం మండలం 24 గ్రామ పంచాయతీల వర్కర్స్ జీతాలు సుమారు 3 నుంచి 9 నెలల వరకు పెండింగ్ లో ఉన్నాయని,రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా నిధులు మంజూరు చేసినప్పటికీ, అశ్వాపురం మండలంలో ఇంతవరకు కార్మికుల ఖాతాలో జమ కాలేదని, వెంటనే కార్మికుల ఖాతాలో పెండింగ్ వేతనాలు జమయ్యే ఏవిధంగా మరియు కార్మికులకు దసరా సందర్భంగా రెండు జతలు యూనిఫామ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, వర్కర్స్ పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకి, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ అందజేశారు. పాయం సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో,
గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, మండల అధ్యక్ష కార్యదర్శులు, ఎడెల్లి శ్రీను, దారావత్ రాంబాబు,
ఏఐటీయూసీ మండలం నాయకులు, ఈనపల్లి పవన్ సాయి, అక్కెనపల్లి నాగేంద్రబాబు, కొల్లు ఉప్పల్ రెడ్డి, దొడ్డ వెంకటేశ్వర్లు, సున్నం శ్రీను, దావూరి వెంకన్న, రాము, నరసింహారావు, మల్లూరు, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు..