బెల్లంపల్లి, అక్టోబర్ 05 వై సెవెన్ న్యూస్;
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంటా చౌరస్తాలో శనివారం పెరిగిన నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట్ స్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అన్నారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చినా ధరలను నియంత్రించలేదని అన్నారు. దేశంలో ఉల్లి, వెల్లుల్లి కొరత లేకున్నా దళారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరగడానికి కారణమవుతున్నారని, అలాంటి దళారులు, బ్లాక్ మార్కెట్ దారులపై చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ముగాస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువును అక్రమంగా నిల్వలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిత్యవసర సరుకుల ధరలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, లేని ఎడల ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లంపూర్ణిమ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్, *ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్* , జిల్లా సమితి సభ్యులు గుండా చంద్రమాణిక్యం, అక్క పెళ్లి బాపు, లింగాల అమృత,ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని, రత్నం ఐలయ్య, బొంకూరి రామచందర్, రత్నం రాజం, బొల్లం తిలక్ అంబేద్కర్, పుట్ట శీను, గుండా ప్రశాంత్, తిరుపతి, మారాలు, గోలేటి రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.