సొంత డెయిరీ ఏర్పాటు చేయండి!
* టీటీడీకి రామచంద్ర యాదవ్ సూచన
* “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” ముగింపులో సంచలన ప్రకటన
* రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీకి కీలక సూచనలు
* 10 వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక సూచన..
BCY పార్టీ అధినేత ” రామచంద్ర యాదవ్ ” సంచలన ప్రకటన చేశారు.. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేసి, సొంతంగా నెయ్యి తయారీకి తన వంతుగా భారీ సాయం ప్రకటించడంతో పాటూ ఓ పెద్ద బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.. వందలాది మంది భక్తులతో కలిసి ఆయన చేపట్టిన “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” మంగళవారం ఉదయం స్వామి దర్శనంతో ముగిసింది.. ఈ సందర్భంగా తిరుమలలో విలేఖరుల నిర్వహించి కీలక ప్రకటన చేశారు.. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన, స్వామివారికి పూజల్లో వినియోగించే నెయ్యి సొంతంగా తయారీ కోసం సూచనలు చేశారు..!
వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమీకరిస్తా..!
కోట్లాది మంది భక్తులు.. వేల కోట్ల ఆస్తులు ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో సొంతంగా డెయిరీ లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి.. లడ్డు ప్రసాదం సహా, పూజా నెయ్యి కూడా అపవిత్రం అవుతుంది. అందుకే సొంత డెయిరీ ఏర్పాటు చేయాలని సూచించా