చెన్నై,అక్టోబర్ 04 వై 7 న్యూస్;
అపోలో ఆసుపత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. చెన్నై అపోలో ఆసుపత్రి నుండి
డిశ్చార్జ్ అయిన ఆయన నేరుగా తన నివాసానికి చేరుకున్నారు.3 రోజుల క్రితం అనారోగ్యంతో రజినీకాంత్
ఆసుపత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే రక్తనాళంలో వాపు ఏర్పడడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. సర్జరీ అనంతరం కోలుకొని ఇంటికి చేరడంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ నెల 10వ తేదీన ఆయన నటించిన “వేట్టయాన్” థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి అందరికీ తెలిసిందే.
Post Views: 86