నాలుగు నెలలుగా పడని జీతాలు, ఈ ప్రభుత్వానికి మేమంటే అంత చిన్న చూపా!
అశ్వాపురం,అక్టోబర్ 04,వై సెవెన్ న్యూస్
కే సైదులు (ప్రతినిది)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం,మెట్టగూడెం గ్రామం పరిధిలో ఉన్నటువంటి రథం గుట్ట,మిషన్ భగీరథ కార్మికులుకు నాలుగు నెలలుగా పడని జీతాలు,మాకు పనిచేయకపోతే పస్తులు ఉండాల్సిందే అంటూ..! కడుపు మార్చుకుంటూ, తలవంచుకొని పని చేస్తున్నాము అయినా సరే పట్టించుకోని అధికారులు, అటువంటి పరిస్థితుల్లో 32 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న, ప్రభుత్వ అధికారులు స్పందించని కారణంగా, ఈనెల 5వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నామని డి ఈ కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి సతీష్ ,అధ్యక్షులు పాయం నాగరాజు, కోశాధికారి పాయం అనిల్, ఉపాధ్యక్షులు ఇరుప లక్ష్మణ్, ఓ సైదులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు ,కమిటీ సభ్యులు ఎంవి నాగభూషణం మరియు కార్మికులందరూ పాల్గొనడం జరిగింది.









