E-PAPER

గేదెలకు లంచం.. ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి

నల్గొండ,సెప్టెంబర్30 వై 7 న్యూస్;

గేదెలకు ఆరోగ్య భీమా ట్యాగ్ వేసేందుకు ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పశువైద్యాధికారి చిక్కాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది.నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి గ్రామానికి చెందిన ఇరువురు రైతులు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం స్కీం క్రింద బర్రెల కోసం 10 లక్షల రూపాయల రుణం కింద ఏపీజీవీబీ చింతపల్లి బ్యాంకు నుండి మంజూరయ్యాయి.అయితే బర్రెలకు ఆరోగ్య భీమా కు కోసం పశువైద్యాధికారి డీజే పాల్ ను ఆ రైతులు కలిశారు. రుణం మంజూరై 15 రోజులు కా వస్తున్నప్పటికీ ఫీల్డ్ మీదికి రమ్మని సదరు రైతులు పదే పదే కోరగా ఫీల్డ్ మీదికి వెళ్లి కొనుగోలు చేసిన బర్రెలను పరిశీలించి వాటికి ట్యాగులు కూడా వేశారు.అనంతరం ఆరోగ్య భీమ ధ్రువీకరించడానికి నిరాకరించి 8000 వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఏపీజీవీబీ అధికారులు రైతులను ఆరోగ్య బీమా గూర్చి కోరగా వెటర్నర్ డాక్టర్ జీజే పాల్ వద్దకు బ్రతిమిలాడి 6వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.ఆయన 6000 రూపాయలు ఇస్తామని రైతులు ఒప్పుకున్నప్పటికీ తీసుకోక పోగా రెండు, మూడు రోజుల నుండి వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో విసిగిన రైతులు నల్లగొండ ఏసీబీ అధికారులను సంప్రదించారు.సోమవారం రైతుల పేర్లు గోప్యంగా ఉంచి ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర, ఎస్సైలు, వెంకట్రావు, రామారావు తో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని లంచం డబ్బులు సీజ్ చేసి విచారణ అనంతరం పశువైద్యాధికారి జీజె పాల్ ను రిమాండ్ కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News