వర్ని సెప్టెంబర్24 వై 7న్యూస్ ప్రతినిధి;
వర్నిమండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కులకర్ణి సురేష్ బాబా నియమితులు అయ్యారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ శాఖ వారిని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షులుగా మోస్రా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తిమీర్ కార్ లక్ష్మణ్, సభ్యులుగా నిమ్మలపూడి పుల్లాజీ, మెగావత్ సంతోష్, గౌరారం రమేష్ గౌడ్, షేక్ అహ్మద్, వేములపల్లి సుధాకర్ రావు, షేక్ మహబూబ్, పార్వతి ప్రవీణ్, బట్టు నాగయ్య, నర్సడి గళ్ళ లావణ్య, వంగా సాయ గౌడ్, తాళ్లూరి మహేష్ , ఓరిక గంగాధర్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సహాదారు పోచారంశ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజుకి కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.