E-PAPER

ముఖ్యమంత్రి నివాసంలో సీతక్క

. రెండు రోజుల పర్యటన ముగించిన మంత్రి

. ఆదివాసి సంఘాలతో చర్చలు

. ముస్లిం సంఘ పెద్దలతో చర్చలు చేసే అవకాశం

. అత్యాచార కేసులో గాయపడిన మహిళ సేఫ్

. ఆదివాసి కుటుంబానికి ఆర్థిక సాయం

వై సెవెన్ న్యూస్ హైదరాబాద్

హైదారాబాద్ మహానగరంలో సోమవారం ముఖ్యమంత్రి రెడ్డి స్వగృహంలో కలిసి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క రెండు రోజుల పర్యటన మరియు ఆగస్టు 31 న జైనూరు మండలం దేవుగూడ శివారులో ఆదివాసీ మహిళా పై అత్యాచారం పై రెండు కులాల మధ్య జరిగిన ఘర్షణను ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి వివరించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క. ఆదివాసీ మహిళా పై ఇటీవలే అత్యాచారం చేసి తీవ్రంగా గాయపర్చడం తో గాంధీ హాస్పటల్ లో చికిత్స అందించడం జరిగిందని ఇప్పుడు ఇప్పుడే ఆ మహిళా కోలుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన శాఖ నుండి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని, గాంధీ హాస్పటల్ లో మెరుగైన చికిత్స కూడా అందించడం జరిగిందని ,ఆదివాసీ సంఘాలు మరియు ముస్లిం ల మధ్య జరిగిన గొడవ జరగటం తో నిన్న ఆదివాసీ సంఘాల తో చర్చలు జరపడం జరిగిందని, రేపు ముస్లిం పెద్దల తో చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి వివరించారు.
మంత్రి వర్యులు సీతక్క వెంట ఎమ్మెల్యే వేడ్మ బొజ్జ తో పాటు సత్తు మల్లేష్ ఉన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!