. టి ఏ లు డిఏలు సరెండర్ లీవ్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
. వినతి పత్రం అందజేసిన పోలీస్ సంఘం అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు పటేల్
వై సెవెన్ న్యూస్ ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు అయితే రక్షణ శాఖ అని పిలిచే పోలీస్ సిబ్బందికి గత కొద్ది కాలంగా టి ఏ లు డిఏలు సరెండర్ లీవ్స్ బకాయిలు రాక పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు కష్టం వచ్చిన అధికారులకు రక్షణ కావాలి అనుకున్న ముందుగా గుర్తు వచ్చేది పోలీస్ శాఖ. అలాంటి పోలీస్ శాఖ సిబ్బందికి పెండింగ్ బకాయిలు ఉంచడం అనేది సరైన పద్ధతే కాదు అని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి నీ కలిసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరి శెట్టి శ్రీనివాసరావు పటేల్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఎంతోకాలంగా సిబ్బందికి పెండింగ్ బకాయిలు ఉన్నందున అవి వెంటనే చెల్లించాలి అంటూ ఆయన మంత్రిని కోరారు. పోలీస్ శాఖలో టి ఏ లు, డిఏలు సరెండర్ లీవ్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మంత్రిని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లా పోలీస్ సిబ్బంది పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం వలన సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ మంత్రికి తెలియజేశారు. ఘనంగా సన్మానించి భద్రాచలం శ్రీ సీతారాముల స్వామి వారి మెమెంటో ను బహుకరించారు. మరి ఇప్పటికైనా ప్రజలకు ఏ కష్టమైనా రక్షణ కల్పించే పోలీస్ శాఖ సిబ్బందికి అధికారులకు పెండింగ్ బకాయిలు ప్రజా పాలన ప్రభుత్వం వెంటనే చెల్లిస్తారా లేదంటే టేక్ టి జి అంటూ భావిస్తారా వేచి చూడాలి మరి.