తూప్రాన్, మార్చి,13. వై సెవెన్ న్యూస్
తూప్రాన్ మున్సిపల్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎల్.అర్.ఎస్ గురించి తూప్రాన్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ జెడ్పీ సీఈవో వివరించి అవగాహన కల్పించారు. వార్డ్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్ లతో సమావేశం నిర్వహించి వివరించారు.ఎల్.అర్.ఎస్ కు అప్లికేషన్ చేసుకున్న వారు ఈనెల 31 లోపు రుసుమును చెల్లించి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ గణేష్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్ లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 183