E-PAPER

రాహుల్ గాంధీ దేశాప్రజలకు క్షమాపణ చెప్పాలి.

. హన్మకొండ దళిత మోర్చా జిల్లా ఇంచార్జి
డా జాడి రామరాజు నేత

వై సెవెన్ న్యూస్, హన్మకొండ

సెప్టెంబర్ 23 సోమవారం రోజున బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు తాడేం రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిదిగా హన్మకొండ దళిత మోర్చా జిల్లా ఇంచార్జి డా జాడి రామరాజు నేత రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కు హాజరైనహన్మకొండ ఇంచార్జి డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రరాకముందు నుండి దళితబహుజన వర్గాలపై సమయం దొరికినప్పుడల్లా నాటి జహర్ లాల్ నెహ్రూ నుండి నేటి నాఖిల్ రాహుల్ ఘండి అలియాస్ రాహుల్ గాంధీ వరకు దళితులపై విషం చిమ్ముతూనే ఉన్నారని అన్నారు. అదే విదంగా భారత రాజ్యాంగ ను తుచా తప్పకుండ అమలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అన్నారు.నాడు జహర్ లాల్ నెహ్రూ మహిళ లను చట్టసభలోకి రాకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటి ప్రధాన మంత్రి జహర్ లాల్ నెహ్రూ కదా అని అన్నారు అదే విదంగా మహిళ లకు 33%రిజర్వేషన్ బిల్లు కోసం మొదటి న్యాయశాఖమంత్రి రాజ్యాంగనిర్మాత డా బాబా సాహెబ్ అంబెడ్కర్ ను నిండు పార్లమెంట్ లో అవమాన పరచి రాజీనామా చెయ్యడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు జహర్ లాల్ నెహ్రు అయితే, అంబేద్కర్ కోరుకున్న 33% మహిళా బిల్లును ఆమోధించి చట్టం తీసుకొంచింది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. అదే విదంగా రాహుల్ గాంధీ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుని గా విదేశాలకు వెళ్లి దేశం లో ఉన్న చట్టాలను అగౌరాపరుస్తున్నారని అన్నారు. అదేవిదంగా
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ,ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహం శుద్ధి చేసి పులామాల వేసినారు తర్వాత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన అమెరికా లో భారతదేశ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు తమ గవర్నమెంటు వచ్చాక రిజర్వేషన్లు రద్దు చేస్తామని దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన కారణంగా భారతదేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ముడుసు స్టాలిన్, జిల్లా సెక్రెటరీ నల్ల రవీందర్, ఎస్సి మోర్చ హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి బండి వినయ్ సాగర్, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :