E-PAPER

మోతే వీరభద్ర స్వామి గుడిని పరిశీలించిన ఎమ్మెల్యే పాయం

. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం ఎమ్మెల్యే పాయం

బూర్గంపాడు,సెప్టెంబర్ 24 వై సెవెన్ న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గ్రామపంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో 1500 సంవత్సరాల క్రితం వెలిసిన వీరభద్ర స్వామి గుడిని అకాల వర్షాల కారణంగా గోదావరి పోటు కి సైడ్ గోడ వాలు కృంగిపోయిన విషయం తెలుసుకొని సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గోదావరి మార్గంలో ప్రయాణించి గుడిని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ అధికారులతో గుడికి జరిగిన నష్టాన్ని అంచనా వేయమని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని, భక్తులు సోషియల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని సూచించారు. వీరభద్ర స్వామివారి దేవాలయం చుట్టూ నెలకొన్న ప్రహరీ ఇటీవల వచ్చిన గోదావరి వరద ప్రవాహానికి కూలిందే తప్ప దేవాలయానికి ఏంకాలేదని సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా వస్తున్న వదంతులను భక్తులు నమ్మకుండా మునుపటిలాగే పూజలు నిర్వహించుకోవాలని,త్వరలోనే దేవాలయ అభివృద్ధి ప్రహరీ నిర్మాణంపై నిధులు మంజూరుచేయించి ఆలయ పునర్నిర్మాణభివృద్ధికి సహకరిస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :