తూప్రాన్ సెప్టెంబర్ 23 వై సెవెన్ న్యూస్
తూప్రాన్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి రైస్ గోదాం వరకు వీధిలైట్లు వెలగడం లేదు. ప్రజలు చీకట్లో డబుల్ బెడ్ రూమ్ కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలలో పనిచేసే మహిళలు రాత్రి 7 నుండి 10 గంటల వరకు ఈ దారి నుండి రావడం జరుగుతుంది. ఎవరైనా వేరే గ్రామానికి వెళితే బస్సు దిగి నడుచుకుంటూ సెల్ఫోన్ టార్చ్ లైట్ పట్టుకొని రావడం, ముఖ్యంగా రాత్రివేళ ఎవరికైనా జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతులో పెట్టుకొని ఆస్పత్రికి వెళ్తున్నారు. రాత్రి అయింది అంటే ఈ దారిన రావాలన్నా వెళ్లాలన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికైనా సంబంధితఅధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలు మరమత్తులు చేయాలని డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు ముఖ్యంగా మహిళలు కోరుతున్నారు.
Post Views: 428