ఎల్లారెడ్డి సెప్టెంబర్ 21వై న్యూస్ తెలుగు
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ క్రింది స్థాయి సిబ్బంది వరకు వారానికి ఒక్కరోజు వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి నిద్ర చేయాలని ఆదేశాలను జారీ చేయగా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఒకవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరే విధంగా చూస్తూ, మరొకవైపు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తక్షణం స్పందించి సంబంధిత శాఖ అధికారులు అలర్ట్ చేస్తూ, సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మరొక్క అడుగు ముందుకు వేసి వసతి గృహల్లో విద్యార్థులు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఏకంగా జిల్లా కలెక్టర్ రాత్రి పూట విద్యార్థులు కలిసి వసతి గృహాల్లో నిద్ర చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులతో కలిసి నిద్రించారు. విద్యార్థులు పడుకునే మంచం మీద పడుకొని వారు కప్పుకునే దుప్పట్లు కప్పుకొని నిద్రించారు.