మిర్యాలగూడ,సెప్టెంబర్21 వై 7 న్యూస్;
ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అవంతిపురం కేజీవిబి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం యందు సీడీపీఓ మమత ఆధ్వర్యంలో, పోషణ మాసం సందర్భంగా కిశోర బాలికలు బాగా చదువుకొని అన్ని రంగాలలో ముందు ఉండాలని,ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా బాగా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి అని,మంచి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి చెప్పారు.
పోషణ మాసం సందర్భంగా కేజీవీబి పాఠశాలలో పిల్లలకి ఆలగడప పీహెచ్‌సీ వైద్యులు డా మోయిద్ ఆరోగ్య పరీక్షలు శిబిరం నిర్వహించి రక్త హీనత తో బాధపడుతున్న పిల్లల రక్త నమూనాలు స్వీకరించి ల్యాబ్ కి పంపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కేజీవీబి ఎస్ ఓ పార్వతి , ఐసిడిఎస్ సూపర్వైజర్ రాధిక, ఏఎన్ఎం శాంత,కేజీవీబి ఉపాధ్యాయినిలు, అంగన్వాడి టీచర్ లు అంజమ్మ,మణెమ్మ,అంజలి, సుజిత,ల్యాబ్ టెక్నషియన్ సైదులు,ఆశ రుక్మిణి కిషోరా బాలికలు పాల్గొన్నారు.