E-PAPER

జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎంఎల్ఏ మదన్ మోహన్

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 21వై సెవెన్ న్యూస్

ఎల్లారెడ్డి నియోజవర్గంలో శనివారం, గాంధీ భవన్ నందు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్.ఈ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి చేస్తున్న కార్యక్రమాల పై నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులునిర్వహిస్తున్న గ్రామ స్థాయి మీటింగ్ గురించి ఎంఎల్ఏ మదన్ మోహన్ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి వివరించారు.అనంతరం పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి దీపా దాస్ మున్షీని శాలువ తో సన్మానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్