మిర్యాలగూడ,సెప్టెంబర్21 వై7 న్యూస్
చేనేత పితామహులు స్వాతంత్ర సమర యోధులు తెలంగాణ తొలి మలి ఉద్యమకారులు మాజీ మంత్రి స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా,బీసీ జెఎసి ఆధ్వర్యంలో మారం శ్రీనివాస్ అధ్యక్షతన వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం లక్ష్మణ్ బాపూజీ తన జీవితం అంకితం చేశారని, పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్న అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పరితపించిన మహానేత అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. పేద ప్రజలకు అనేక సేవలందించి, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ జీవితాశయాన్ని ప్రతిఒక్కరం ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ్ సింహరెడ్డి , బీసీ సంఘం నాయకులు చిరుమర్తి కృష్ణయ్య , చిలుకూరి బాలు, స్కైలాబ్ నాయక్, పసుపులేటి శ్రీనివాస్, తమ్ముడు బోయిన అర్జున్, చంద్రమౌళి, డాక్టర్ రాజు , మాలమహానాడు రవి , జయరాజ్ , క్యామ వెంకటేశ్వర్లు, నాగభూషణం, రాపోలు వెంకటేశ్వర్లు, శ్రీరాములు గౌడ్, డాక్టర్ రాజు , పున్న రాములు, ఈశ్వర చారి, పాండు, బ్రహ్మచారి, రాంప్రసాద్, మహేష్ గౌడ్ , శ్రీనివాస్ యాదవ్ , వెంకన్న గౌడ్ , కుమ్మరి వెంకన్న, చిలుకూరు శ్యామ్ , పాల్గొన్నారు..









