E-PAPER

‘వారణాసి’ యాక్షన్ సీన్స్ కోసం రంగంలోకి ఎంఎంఏ ఫైటర్ యోగేశ్ జాదవ్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం ‘వారణాసి’. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో రాజమౌళి ఓ భారీకాయుడితో దిగిన సరదా ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సుమారు 6.5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఆ వ్యక్తి పక్కన తాను కూడా ఎత్తుగా కనిపించేందుకు జక్కన్న ఏకంగా కుర్చీ ఎక్కి నిలబడిన ఫోటో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

ఇంతకీ రాజమౌళి పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరంటే.. ఆయన పేరు యోగేశ్ జాదవ్. ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ అయిన యోగేశ్ క్రీడా వర్గాల్లో ‘ది జెంటిల్ జెయింట్’గా సుపరిచితుడు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అయిన ఆయన.. ‘బిగ్ బాస్ మరాఠీ’ వంటి పలు రియాలిటీ షోల ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఈ భారీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల రూపకల్పన కోసమే రాజమౌళి ఆయన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన కాశీ నగర సెట్స్‌లో యోగేశ్ పర్యవేక్షణలో అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News