E-PAPER

బాక్సాఫీస్ బరిలో విజయ్ దేవరకొండ వర్సెస్ కార్తీ.. ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్ ఖరారు!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాబోయే సెప్టెంబర్ నెల బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సర్దార్’కు సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అగ్నిపర్వతంలా ఎగిసిపడుతున్న పేలుడు నేపథ్యంలో కార్తీ చేతిలో తుపాకీతో ఉన్న యాక్షన్ గ్లింప్స్ మరియు పోస్టర్‌ను విడుదల చేసి సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశారు.

అయితే, ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్ ప్రకటనతో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో బాక్సాఫీస్ క్లాష్ అనివార్యమైంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియడ్ డ్రామా ‘రణబాలి’ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీ సినిమా విడుదలైన మరుసటి రోజే విజయ్ దేవరకొండ సినిమా బరిలోకి దిగుతుండటంతో సౌత్ ఇండియన్ మార్కెట్లలో ఒక భారీ పోటీకి తెరలేచింది. వినాయక చవితి పండుగ సెలవులను లక్ష్యంగా చేసుకుని ఈ రెండు అగ్ర సినిమాలు కేవలం ఒక్క రోజు గ్యాప్‌తో పోటీ పడుతుండటం ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విలక్షణ నటనతో తెలుగు నాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కార్తీకి ఇక్కడ అద్భుతమైన మార్కెట్ ఉండటం విశేషం. మరోవైపు యూత్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సర్దార్ 2’ అద్భుతమైన స్పై యాక్షన్ ఎలిమెంట్స్‌తో రానుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రణబాలి’ ఒక ఇంటెన్స్ పీరియాడిక్ కథాంశంతో అలరించనుంది. ఆగస్టు చివర్లో యశ్ ‘టాక్సిక్’ కూడా విడుదలవుతుండటంతో, సెప్టెంబర్ నెలలో థియేటర్ల వద్ద జరగబోయే ఈ బాక్సాఫీస్ జాతరలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!