E-PAPER

సీతారాంపురం సెక్టార్ పరిధిలో పోషణ మాసం, సామూహిక సీమంతాలు

మిర్యాలగూడ, సెప్టెంబర్ 14 వై7న్యూస్

ఐ సి డి ఎస్ మిర్యాలగూడ (యు) ప్రాజెక్ట్ పరిధిలోని,సీతారాంపురం సెక్టార్ పరిధిలో వాసవి భవన్ హాల్లో ” పోషణ మాసం” మరియు “సామూహిక సీమంతాలు “కార్యక్రమం ను సిడిపిఓ మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. సిడిపిఓ మమత మాట్లాడుతూ, గర్భిణీ లు తగిన పౌష్టికహారం తీసుకోవాలని, బిడ్డ కడుపులో పడినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు తీసుకోవాల్సిన 1000 రోజుల సంరక్షణ ను వివరించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గర్భిణీ లు మంచి పోషకాహారం గుడ్లు ఆకుకూరలు తీసుకొని, తగిన హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం 15 మంది గర్భిణీ లకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమం లో
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ నాగలక్ష్మి , 42 వ వార్డ్ కౌన్సిలర్ సత్యవేణి శ్రీనివాస్, ఐ సి డి ఎస్ సూపర్వైజర్లు పద్మ,లీలా కుమారి,సుశీల,నజీమా బేగం,రాధిక,వాణి, హేమా దేవి.కవిత,సీతారాంపురం సెక్టార్ అంగన్వాడీ టీచర్స్ విజయ, నజీమా, గౌస్య, తదితరులు,లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :