E-PAPER

ప్రభుత్వం ఆదుకోక పోతే ఆత్మహత్యే దిక్కు

జూకల్ సెప్టెంబర్ 11 వై సెవెన్ న్యూస్ తెలుగు

జూకల్ నియోజకవర్గంలో రైతులు సాగుచేసిన మొక్కజొన్న,, సోయా, పెసర, పత్తి పూర్తిగా వర్షాలకు దెబ్బతిని చేతికి రాకుండా పోవడంతో నష్ట పరిహారం కోసం అన్నదాతలు రోడ్ ఎక్కుతున్నారు. బుధవారం కామారెడ్డి జిల్లాపెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌరస్తాలో బుధవారం కాటేపల్లి రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ.. వర్షాలకు భారీగా పంట నష్టం వాటిలిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదుకోక పోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే దిక్కని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు, పాలకులు స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి నోటికి వచ్చిన పట్టా నీటిపాలు కావడం తమని మరింత అప్పులోకి దించిందని వారు కంటతడి పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదుకోకుంటే తమకు ఆత్మహత్యలే దిక్కు అంటూ అన్నదాతలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు ఇరువైపులా నిలిచిపోయి ఎక్కడికి అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన కారులను సముదాయించి రాస్తారోకో విరమింప చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :