నిజాంసాగర్ సెప్టెంబర్ 11 వై 7 న్యూస్ తెలుగు
నిజాంసాగర్ మండలంలోఎవరి ప్రాణాలు హరిస్తే తమకు ఏందీ,తమ ఆస్తులు పెరిగితే చాలు అనుకుంటున్నారు కల్తీ కల్లు మాఫియా. కామారెడ్డి ,జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా మత్తు పదార్థాలను వినియోగించి కృత్రమ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుతం కల్లు ప్రియులకు కావలసినంత స్వచ్ఛమైన కల్లు లభించకపోవడంతో, కొంతమంది కల్లు ముస్తేదర్లు కృత్తిమకల్లు తయారు చేస్తూ ,ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా పర్యాటక కేంద్రమైన నిజాంసాగర్ మండలంలో విచ్చలవిడిగా కృత్తిమ కల్లు తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. స్వచ్ఛమైన కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ. ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు దొరకకపోవడంతో ,కల్లు ముస్తేదర్లు కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల్ని అనారోగ్య బారిన పడేస్తున్నారు. ఈ కృతిమ కల్లు త్రాగకుంటే ఒక గంట అయినా బతకలేని పరిస్థితి తెచ్చి పెడుతున్నారు కల్తీ కల్లు మాఫియా. వైట్ పేస్టు, హైడ్రోక్లోరైడ్, క్లోరోఫామ్, ఆల్ఫా జోలాం లాంటి విష పూరిత మత్తు పదార్థాలను వినియోగించి కృత్రిమ కల్లు తయారీ చేస్తూ మార్కెట్లో అమ్ముకుంటూ లక్షలు గడుస్తున్నారు. ఈ కల్తీ కల్లు అరికట్టవలసిన ఎక్సైజ్ శాఖ అధికారులు నెలల ముడుపులు అందుకుంటూ వారి ఆస్తులను పెంచుకుంటూ పోతున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కల్తీకల్లు ను అరికట్టవలసిన ఎక్సైజ్ శాఖ అండదండలు ఉండడంతో నిజంసాగర్ మండలంలో జోరుగా కృత్రమ కల్లు విక్రయాలు మూడు గ్లాసులుఆరు సీసాలుగా వర్ధిల్లుతుంది అని స్థానికులు వాపోతున్నారు.ఈ కల్లు తాగిన వారు దీనికి బానిసలు అవుతున్నారని ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు కల్తీకల్లు తయారీ దారులపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.