E-PAPER

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నుండే చీరలు, గాజుల సంస్కృతి మొదలవ్వాలి

తూప్రాన్ సెప్టెంబర్ 11 వై సెవెన్ న్యూస్

గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి నుండే చీరలు, గాజుల సంస్కృతి మొదలవ్వాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ అన్నారు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు గాజులు, చీరలు వేసుకోవాలన్న కౌశిక్ రెడ్డి మాటల పై బుడ్డ భాగ్యరాజ్ ఘాటుగా స్పందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భార్యను, కూతుర్ని అడ్డుపెట్టుకొని కౌశిక్ రెడ్డి శవ యాత్ర రాజకీయం చేసి గెలిచిన నువ్వు ఇతర ఎమ్మెల్యేలను గురించి మాట్లాడేది లేదన్నారు గత కెసిఆర్ ప్రభుత్వం 38 మంది ఇతర ఎమ్మెల్యేలను అంగట్లో పశువుల్లాగా కొన్నందుకు ముందు, కేటీఆర్, హరీష్ రావు కు గాజులు చీరలు పంపించాలని అన్నారు. గాజులు, చీరల సంస్కృతి హుజురాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకు కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉండాలని బుడ్డ భాగ్యారాజ్ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :