బెజవాడ వెంకటేశ్వర్లు CPI కార్యదర్శి.
వుస్తెల సృజన మహిళా సమాఖ్య రాష్ట్ర అద్యక్షురాలు.
సూర్యాపేట, సెప్టెంబర్ 11 వై 7న్యూస్
భూమి కోసం ,భుక్తి కోసం,వెట్టిచాకిరీ నుండి విముక్తి కోసం,నైజాం ఆటవిక రాజరిక పాలనకు వ్యతిరేకం గా,నిజాం రజాకర్ సైన్యంతో పోరాడి,దొరల,భూస్వాముల,దేశముఖ్ ల గుండాలకు వ్యతిరేకం గా కమ్యునిష్టులు వీరోచిత పోరాటం ద్వారానే తెలంగాణ కు విముక్తి లభించిందని CPI సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,మహిళా సమాఖ్య రాష్ట్ర అద్యక్షురాలు వుస్తెల సృజన లు అన్నారు.తెలంగాణ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవాలను గరిడేపల్లి మండలం లోని పొనుగొడు గ్రామంలో మాజీ సర్పంచి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ హనుమాల లింగయ్య గారి స్తూపమ్ వద్ద,గానుగబండ,రంగాపురం గ్రామాల అమరవీరుల స్తూపాల వద్ద అరుణ పతాకాలను ఎగుర వేసి నాడు వారు ప్రజల కొరకు పోరాడిన పోరాటాలను స్మరించుకొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సాయుధ పోరాటం తో ఏ సంబంధం లేని,ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పార్టీ చరిత్రను వక్రీకరించి మత ఘర్షణలుగా చుపించటానికి ప్రయత్నిస్థున్నారని అన్నారు.
ఈ కార్యక్రమానికి CPI మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అద్యక్షత వహించగా,కార్యక్రమం లో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్,బద్దం క్రిష్ణరెడ్డి,దేవరం మలీస్వరి,కొటమ్మ,CPI మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య,యడ్ల అంజిరెడ్డి,బిల్ల కనకయ్య,ప్రజానాట్యమండలి కళాకారులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనారు.