గరిడేపల్లి, సెప్టెంబర్ 11 వై 7న్యూస్
బుధవారం గరిడేపల్లి మండల కేంద్రము జీవము గల దేవుని సంఘం నందు గరిడేపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక , మాజీ అధ్యక్షులు పాస్టర్ దేవదానం అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ జి డేవిడ్ రాజు , గౌరవ సలహాదారులు పాస్టర్ సామ్యూల్ గుండు జిల్లా సభల కన్వీనర్ పాస్టర్ పాల్రాజు, హుజూర్నగర్ నియోజకవర్గ ప్రెసిడెంట్ పాస్టర్ టీ సుధాకర్ సమక్షంలో కమిటీ ఎన్నిక చేయడం జరిగింది.
గౌరవ అధ్యక్షులుగా పాస్టర్ జాకబ్ రాజు ,ప్రెసిడెంట్ గా పాస్టర్ పౌలు ,వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ కరుణాకర్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ కోటేశ్వరరావు , సెక్రటరీ పాస్టర్ ప్రభు కిరణ్ , జాయింట్ సెక్రెటరీ పాస్టర్ చిట్టిబాబు, ట్రెజరర్ పాస్టర్ లక్ష్మణ్ నాయక్ ,గౌరవ సలహాదారులు పాస్టర్ ఇమ్మానుయేలు, పాస్టర్ జకర్య ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాస్టర్ ఎం జేమ్స్, జేమ్స్ ఆనంద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇట్టి సమావేశమునకు గరిడేపల్లి మండలానికి చెందిన 30 మంది పాస్టర్స్ హాజరు అయినారు