E-PAPER

సొంత భూమి కోసం ఇద్దరు పిల్లలతో మహిళ పోరాటం

బాన్సువాడ సెప్టెంబర్ 11 వై 7 న్యూస్

బాన్సువాడ మండల కేంద్రంలో
నా భూమి నాకు ఇప్పించండి అంటూ బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో నిరసన వ్యక్తం చేసింది, వివరాలలోకి వెళ్తే జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన గైని పూజ ఆమె తల్లిదండ్రులు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రుల యొక్క భూమి ఒక ఎకరం మూడు గుంటలు కూతురుగా గైని పూజకు అనుభవించే హక్కు ఉండగా తల్లిదండ్రులు మరణించిన సమయంలో గైని పూజ మైనర్ కాగా వేరే వ్యక్తి తన భూమిని ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని అనుభవిస్తున్నాడని సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేసింది, రెవిన్యూ అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదని తన భూమి తనకు ఇప్పించేంతవరకు వదిలి పెట్టేది లేదని ఫిర్యాదులో పేర్కొంది, హక్కుదారుగా వారసత్వ భూమి తనకు చెందేలా చూడాలని సబ్ కలెక్టర్ కిరణ్మయిని ఫిర్యాదు చేయడంతో సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు వివరాలు అడిగి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News