. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC
కొత్తగూడెం,సెప్టెంబర్ 6 వై 7 న్యూస్
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని,లాభాల్లో వాటాను కాంట్రాక్ట్ కార్మికులకు నిర్ణయించి అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కిష్టాఫర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ లో వాటర్ సప్లై మరియు సెంట్రల్ వర్క్ షాప్ కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశాలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచకుండా పాలకవర్గాలు మరియు యాజమాన్యం తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నాయని అరకోర వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయాల్సి వస్తుందని,తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచి అమలు చేయాలని సింగరేణి కంపెనీ వేలకోట్ల రూపాయల లాభాల్లో నడుస్తుందని,ఆ లాభాలకు కారణమైన కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు.గతంలో 18 రోజుల సమ్మె సందర్భంగా ఒప్పందంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని లేనియెడల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమవుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రబ్బాని, రమేష్, రామ్ శంకర్, కాంట్రాక్ట్ కార్మికులు గుర్రం శ్రీనివాస్, రాజు, సూర్య, ప్రసాద్, భాస్కర్, గణేష్, కృష్ణ ,విక్రం తదితరులు పాల్గొన్నారు.