E-PAPER

వినాయక చవితి శుభాకాంక్షలు

. దేవరకొండ మైనార్టీ యువనాయకులు సయ్యద్ సద్దాం హుస్సేన్

దేవరకొండ ,సెప్టెంబర్06 వై 7 న్యూస్;

వినాయక చవితి శుభ సందర్భంగా నల్గొండ జిల్లా దేవరకొండ లోని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ మైనార్టీ యువనాయకులు సయ్యద్ సద్దాం హుస్సేన్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ శాంతి, సామరస్యాన్ని అందించే వినాయకుడు ప్రతి ఇంటిపై తన అనుగ్రహాన్ని కురిపించాలని అన్నారు. సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తున్నప్పుడు, ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడానికి ఈ పండుగ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి వాడలో జరిగే ఈ నవరాత్రులు 12 వార్డ్ ప్రజలు మరియు దేవరకొండ నియోజకవర్గ ప్రజలంతా భక్తి భావంతో పూజలు చేసి భగవంతుని అనుగ్రహం పొందాలని సూచించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి వ్యక్తి తమ తమ వృత్తులలో వర్ధిల్లాలని, విజయం మరియు ఆనందాన్ని పొందాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుని దివ్య కృపతో మార్గనిర్దేశం చేయబడిన ప్రయత్నాలన్ని ఫలించాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News