వై 7న్యూస్ ఖమ్మం క్రైం, నవంబర్ 6: ఖమ్మం నగరంలో గంజాయి సేవించినట్లు పరీక్షల్లో తేలడంతో ముగ్గురు వ్యక్తులపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం టూ టౌన్ ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12.25 గంటలకు బైపాస్ రోడ్డులో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ఇందిరానగర్ శ్మశానవాటిక ఎదుట ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని ప్రశ్నించగా, గంజాయికి అలవాటుపడ్డామని, శుక్రవారం ఉదయం కూడా గంజాయి సేవించామని కలపటంతో వారిని విచారించగా ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి తీసుకున్నట్లు వారు వెల్లడించారూ.
అనంతరం ఎబాన్ (ABON) 12-ప్యానెల్ కిట్‌తో మూత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో 1,ఇందిరానగర్‌లోని చైతన్యనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్,2,కుర్రా రాజేశ్వర్ అలియాస్ రాజేశ్ (30), పాండురంగాపురానికి చెందిన డ్రైవర్, 3, బింకా సురేశ్ (27), రోటరీనగర్‌కు చెందిన డీసీఎం డ్రైవర్ వట్టికోటి నరేశ్ (36)లకు టీఎచ్‌సీ పాజిటివ్‌గా రావడంతో ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి పరీక్ష ఫలితాల ఆధారంగా వారిపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








