హుజూర్ నగర్, అక్టోబర్ 6 వై న్యూస్;
హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలోని డిజే యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి ముందస్తు గా తహసీల్దార్ గారి ముందు 17 మందిని బైండోవర్ చేసిన హుజూర్ నగర్ సిఐ జి.చరమంద రాజు.ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతు సర్కిల్ పరిధిలో డిజె లకు ఎలాంటి పర్మిషన్ లేదని, ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి డిజే పెట్టినట్లైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని డిజె బాక్స్ లను సీజ్ చేసి గౌరవ కోర్ట్ లో అప్పగిస్తాము.అలాగే వినాయక చవితి విగ్రహం ప్రతిష్టించే ప్రతి ఒక్కరూ,తప్పని సరిగా, పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని, అప్లై చేసిన క్యూార్ కాగితాలు మండపం వద్ద తప్పని సరిగా కలిగి ఉండాలని సర్కిల్ పరిధిలోని వినాయక కమిటీ వారు పోలీస్ వారికి సహకరించి, భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకోవాలని కోరినారు.
Post Views: 93