గార్ల ,సెప్టెంబర్ 6 వై 7 న్యూస్
గార్ల మండల కేంద్రంలో ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ శ్రీ మువ్వ విజయ్ బాబు జన్మదిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గార్ల సొసైటీ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య మరియు గార్ల మండలం సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి మువ్వ విజయ్ బాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనియాకుల రామారావు , గార్ల మండలం సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు షేక్ యాకూబ్ పాషా , ఇల్లందు నియోజకవర్గ నాయకులు భూక్య బాబూలాల్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మండ రాము గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీరియల్ నాయకులు వెంకయ్య మాజీ ఉప సర్పంచ్ సురేష్, వీరస్వామి యూత్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ నాయుడు,భూక్యా రామ్ సింగ్,భూక్యా అశోక్, శ్రీశైలం నాగార్జున, తదితరులు పాల్గొన్నారు