హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ముందస్తుగా వినాయక చవితి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. చిన్నారులు మట్టితో పిండితో తయారుచేసిన గణపతి లతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రిన్సిపాల్ వెంకటరమణారావు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు అన్ని పర్వదినాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు ఆధ్యాత్మిక అంశాలను కూడా తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమాల్లో ఇన్చార్జిలు సంధ్య, నాగ కన్య, నాగమల్లేశ్వరి, శ్వేత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 215