E-PAPER

నోట్లో పాము పెట్టుకుని వీడియో: యువకుడు మృతి

బాన్సువాడ ఆగస్టు 6 వై 7 న్యూస్

త్రాచుపాము… ఆ పాములు పట్టుకోవడం అంటే ప్రాణాలతో చెలగటం. ఒక కాటు వేసిందంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అలాంటి విషపూరితమైన త్రాచు పాముతో ఆటలాడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు ఓ యువకుడు. తన తండ్రి పట్టుకున్న త్రాచు పాము ను, కొడుకుకు ఇచ్చాడు. నా కొడుకు ఆ త్రాచుపాము తో నడిరోడ్డుపై నిలబడి విన్యాసాలు చేస్తూ, పాము ను ముద్దు పెట్టుకున్నాడు. తనను పట్టుకోవడమే కాకుండా, తనతో విన్యాసాలు చేపిస్తూ తనకే ముద్దులు పెడతావా? అనుకుంది ఏమో ఆ త్రాచుపాము ముద్దులు పెట్టుకుంటున్న ఆ యువకుడ్ని కాటేసింది, ఇంకేముంది క్షణాల్లోనే ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అధికారులు, పోలీస్ యంత్రాంగం పదేపదే గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ విద్యుత్, అగ్ని, నీళ్లు, విషపురుగుల జోలికి వెళ్లకూడదు అంటూ సూచిస్తున్నప్పటికీ. కొందరు వాటితో ఆటలు ఆడి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని దేశాయిపేట గ్రామంలో ఓ యువకుడి పాముతో చేసిన విన్యాసాలు మరణానికి దారి తీసాయి. గ్రామంలో పాముకాటుతో మోచే శివరాజులు(23)తండ్రి గంగారం పాముని పట్టుకొని కొడుకుకి ఇచ్చాడు నోట్లో పెట్టుకుని వీడియో తీసి గ్రూప్లో పెట్టమని చెప్పడంతో యువకుడు పామును నోట్లో పెట్టుకుని వీడియో తీస్తూ ఉండగా కాటు వేసింది యువకుడు శివరాజులు అక్కడికక్కడే మృతి చెందాడు తండ్రి పాములు పట్టేవాడని కొడుకు కూడా పాములు పట్టడం నేర్పించాడని గ్రామస్తులు తెలియజేశారు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :