. కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్
హుజూర్ నగర్, సెప్టెంబర్ 6 వై 7న్యూస్;
సమాజం అభివృద్ధి చెందాలంటే,అది కేవలం విద్యనందించే ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న దళిత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో అజ్ఞానాన్ని తొలగించి వారిని విజ్ఞానవంతులుగా తయారుచేసి,భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టి,ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మాతంగి ప్రభాకర్,కస్తాల సునీల్ నందిపాటి సైదులు, శ్రీదేవి,మీసాల జనార్ధన్ ఎడవెల్లి వీరబాబు, సీతారాములమ్మ ప్రసాద్ వినయ్, జయమ్మ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31