బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
హుజూర్ నగర్, సెప్టెంబర్ 6 వై సెవెన్ న్యూస్;
కులగణను చేపట్టి, బీసీ జాతి సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు.శుక్రవారం నాడు ఆయన హుజూర్ నగర్ లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో…
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని, దేశంలోనూ రాష్ట్రంలోనూ బీసీలు రిజర్వేషన్లు సాధించుకోలేకపోయారని జనాభా ప్రాతిపదికన, ప్రజలందరికీ న్యాయం జరగాలంటే కులగణన ఒక్కటే మార్గమని, త్వరలో చేపట్టబోయే జనాభా లెక్కలలో అసలు దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఏఏ కులంలో జనాభా శాతం ఎంతో లెక్క తేలితే ఆయా కులాల నిష్పత్తిని బట్టి రాజకీయ రిజర్వేషన్ తో పాటు బడ్జెట్లో కూడా ఆయా కులాల అభివృద్ధికి అంతే నిధులు కేటాయించి స్వాతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాల దరిచేదేందుకు మార్గం సుగమం అవుతుందని, కానీ బీసీ వ్యక్తి ప్రధాని గా ఉండి కూడా బీసీలకు అన్యాయం చేయడంలో ముందున్నారని కేంద్రంలో బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, రెండు లక్షల కోట్ల రూపాయలతో కేంద్రంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వాటికి సొంత భవనాలు నిర్మించాలని గత అనేక సంవత్సరాలుగా బీసీ హక్కుల సబితి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్నామని అయినప్పటికీ కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం బాధాకరమని, ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆ పార్టీ ఆ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని బీసీ కుల గణన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ధనుంజయ నాయుడు తన ప్రకటనలో కోరారు.