హైదరాబాద్,ఆగస్టు 30 వై 7 న్యూస్;
ఇందిర ఫెలోషిప్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బాల వికాస్ కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బూట్ క్యాంప్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది.
మూడవరోజు ఇందిర ఫెలోషిప్ నేషనల్ కోఆర్డినేటర్ మనీష్ ఢిల్లీ నుంచి వచ్చి ముఖ్యఅతిథిగా హాజరుకాగా మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పట్నం సునీత ,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జి ఆత్రం సుగుణక్క ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
మూడురోజులపాటు జరిగిన కార్యక్రమాలను సుగుణక్క ముందుండి నడిపించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికి ఇందిర ఫెలోషిప్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.సౌజన్య సర్టిఫికెట్లను అందించారు.
Post Views: 157









