E-PAPER

గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి;దమ్మపేట పోలీస్

గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

 

. గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి

. దమ్మపేట పోలీసు

 

దమ్మపేట,ఆగస్టు30 వై 7 న్యూస్;

గణేష్ నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను జిల్లా పోలీస్ శాఖ తరపున గణేష్ నవరాత్రి మండపాల నిర్వహకులకు సీఐ కరుణాకర్ పలు సూచనలు చేశారు.గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వుంటుందని,ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,నిమజ్జనం తేదీ,ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు.డిజె సౌండ్ బాక్స్ లకు కు అనుమతి లేదని,రోడ్డు అడ్డంకి లేకుండా గణేష్ మండపాలు వేసుకోవాలని ఈ సందర్భంగా సిఐ తెలిపారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్