పాల్వంచ,ఆగస్టు30 వై 7 న్యూస్;
కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేయాలని సిపిఐ ఎంఎల్- మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో పాల్వంచ అగ్రికల్చర్ ఆఫీసు అధికారి కి డిమాండ్స్ తో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రకరకాల వంకలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని,
పట్టా బుక్ లేదని, రేషన్ కార్డు లేదని ,అడంగల్ పహాని చెల్లదని, 2018 కంటే ముందు తీసుకున్నారని రైతుల రుణమాఫీ చేయకుండా కొర్రీలు పెడుతున్నారని,మరోపక్క ప్రజా ప్రతినిధులు, అధికారులు. ప్రకటనలు చేస్తూ రైతులెవ్వరు ఇబ్బంది పడే పనిలేదని మొత్తం రుణమాఫీ చేస్తామని చెబుతున్నా,
బ్యాంక్ లో రుణాలు మాఫీ చేయక- కొత్త రుణాలు ఇవ్వక రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నదని ,బ్యాంకుల వద్ద అగ్రికల్చర్ ఆఫీసుల వద్ద రైతులు పడిగాపులకు కాస్తున్నారని,
తక్షణమే గ్రామాలలో సమగ్ర సర్వే నిర్వహించి, బ్యాంకు రుణం తీసుకున్న ప్రతి పేద రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని,
వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ, ప్రజాసంఘాల మండల నాయకులు వేల్పుల రమేష్, వగ్గేల పద్మ ,కె భాస్కర్, వై రవి, సూర్యనారాయణ ,జి వెంకటేశ్వర్లు, కే స్వప్న, జ్యోతి, దినకర్ తదితరులు పాల్గొన్నారు.









