E-PAPER

వైద్యుల నిర్లక్ష్యం …… బాలుడు మృతి

బాన్సువాడ , ఆగస్టు 27 వై 7 న్యూస్

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ బాలుడు వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యులు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పిట్లం మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన శంకర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు హేమంత్(3)కు తీవ్ర జ్వరం రావడంతో సోమవారం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కేవలం గ్లూకోజ్ పెట్టి వదిలేశారని, ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదని తండ్రి ఆరోపించారు. రాత్రి వైద్యులెవరు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపారు.మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. తమ నిర్లక్ష్యం ఏమీ లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్