నర్సంపేట, ఆగస్టు 27 వై 7న్యూస్
స్థానిక నర్సంపేట రామాలయం వీధి స్వర్ణ భారతి గల్లీ గ్యాంగ్ వారి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మెడిద శ్రీనివాస్ వారి బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, తోలుత కొబ్బరికాయలతో శ్రీ కృష్ణుడు విగ్రహం వద్ద పూలమాల నారీకేలంతో అర్చకులు నాగరాజు వార్డు సభ్యులు ఇమ్మడి. లక్ష్మి నారాయణ పూర్ణ చందరన్, రాజు తదితరులు పాల్గొని కార్యక్రమం అనంతరం ఆ వార్డు మహిళలు కుటుంబ సభ్యులు వారి వారి చిన్నారుల శ్రీకృష్ణ, రాధ, గోపికల వెన్నె దొంగ లాంటి ఆటాపాట, వేశాధారణ తో చూపరులను అలరించాయి, కార్యక్రమంలో వికాస తరంగిని బాధ్యులు దాస్యం రంగనాధ స్వామి ఉట్టికోట్టినారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చిన్నారులు భగవంతుడిని మనస్సుపెట్టి పూజించాలని శ్రీకృష్ణ భజన చేయించారు, గోపిక, రాధ వేషాధారణ, కోలాఠాలు, ఆటలు పాటలు దాండియా, భక్తి కార్యక్రమాలతో పాటు, సరదాగా ఉట్టి కొట్టె వేడుకలు ఘనంగా చేశారు









