అశ్వాపురం, జూన్ 26 (వై7 న్యూస్): అశ్వాపురం రజక సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ మడేలేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును రజక సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య నాయకత్వంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చేతి పంపు (హ్యాండ్ బోర్) ఏర్పాటు చేయించడంతో పాటు ప్రజా సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు రజక సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు గోకినపల్లి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, కృష్ణ, మల్లయ్య, అన్నారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజలు సహకరించాలని వారు కోరారు.








