మణుగూరు : ప్రస్తుతం అమలులో ఉన్న కొత్త ఇసుక పాలసీలో అక్రమాలు, అవకతవకలు జరిగేందుకు ఎలాంటి అవకాశం లేదని ఇసుక నిర్వాహకుడు శ్రీకర్ పేర్కొన్నారు. మణుగూరు సబ్ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు పూర్తిగా నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
డిషిల్టేషన్ ఇసుక రీచ్‌లపై వస్తున్న కథనా లు, ఆరోపణలు, ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాల నేపథ్యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇసుక నిర్వాహ కుడు శ్రీకర్ వరుస వివరణలు ఇచ్చారు. “అపోహలు తొలగించేందుకే సమావేశం”, “అక్రమాలకు అవకాశం లేదు”, “జీరో బిల్లులు లేవు”, “ఓవర్‌లోడింగ్ జరగదు”, “ఆధారాలు ఉంటే చూపించండి” అంటూ పలుమార్లు ప్రకటించారు. ఇసుక రీచ్‌లపై తప్పుడు ప్రచారాలు చేసి గిరిజనుల ఉపాధిని దెబ్బతీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గిరిజన సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ల ద్వారా అనేక గిరిజన కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నా యని పేర్కొన్నారు. అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం రూపొందించిన కొత్త పాలసీ ప్రకారం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, వాస్తవాలను తెలుసుకోకుండా చెడు ప్రచారాలు చేయ డం వల్ల గిరిజన కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని శ్రీకర్ అన్నారు. గిరిజనుల ఉపాధి, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరిం చాలని ఆయన కోరారు. అయితే గిరిజన సొసైటీల సమావేశంగా నిర్వహించిన కార్యక్రమంలో సొసైటీ సభ్యుల కంటే ఎక్కువగా శ్రీకర్ మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సభ్యుల అభిప్రా యాలను సభ్యులే వెల్లడించాల్సిన చోట, అన్ని అంశాలపై శ్రీకర్ స్పందించడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వినిపి స్తున్నాయి. రిపోర్టర్ల సహకారంతో ఈ స్థాయికి వచ్చాం” అని ఒకవైపు చెబు తూనే, మరోవైపు మీడియా కథనాలపై అసహనం వ్యక్తం చేయడం కూడా చర్చకు దారితీసింది. అక్రమాలు లేవని ప్రకటించడం ఒక్కటే సరిపోదని, ప్రజల్లో ఉన్న సందేహాలకు స్పష్టమైన సమాధా నాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఉపాధికి రాజకీయ రంగు పులమొద్దు అని విజ్ఞప్తి చేసిన శ్రీకర్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి పేర్లు ప్రస్తావి స్తూ కొందరు తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇసుక రీచ్‌ల నిర్వహణ, లావాదేవీలు, సొసైటీల పాత్ర పై ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయడమే ముఖ్యమని పలువు రు పేర్కొంటున్నారు. గిరిజనుల ఉపాధి పేరుతో నడుస్తున్న వ్యవస్థలో నిజంగా అన్నీ పారదర్శకంగానే ఉంటే, అన్ని వివరాలను ప్రజల ముందుంచేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని సామాజిక వర్గాలు అభిప్రాయప డుతున్నాయి.








