పాల్వంచ రూరల్, ఆగస్టు 27 వై సెవెన్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం,
ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన సిబ్బందిని నియమించి ఉల్వనూరు ప్రాంత ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలని ప్రజలు ఈరోజు పిహెచ్సి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులు, స్థానిక ప్రజలు హాస్పిటల్ ఎదుట నిల్చోని మా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ను మరియు ఖాళీగా ఉన్న సిబ్బందిని వెంటనే నియమించి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని నినాదాలు చేశారు. ముఖ్యంగా కొన్ని నెలలుగా రక్త పరీక్షలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు వచ్చినప్పుడు పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం లాంటి పట్టణాలకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకలెక్టర్,DMHO వెంటనే స్పందించి ఉలవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తగిన సిబ్బందిని మరియు ల్యాబ్ టెక్నీషియన్ ను ఏర్పాటు చేసి పేద గిరిజన ప్రజలకు ఆరోగ్యపరంగా అండగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉల్వనూరు గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ బర్ల లక్ష్మణరావు, గ్రామస్తులు వెంకన్న, వీరస్వామి, రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.









