. పంచాయతీ కార్మికుల నిరసన దీక్షను ప్రారంభించిన మచ్చ వెంకటేశ్వర్లు
. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదు
సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జె రమేష్
. పంచాయతీ కార్మికుల సమస్యలపై ఆర్డిఓ కి వినతి పత్రం
భద్రాచలం
గ్రామపంచాయతీ కార్మికుల ఒకరోజు సమ్మె శిబిరాన్ని ప్రారంభించిన వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులు సమ్మె చేసినప్పుడు వారి సమ్మెను పట్టించుకోకపోతే ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు శిబిరాల వద్దకు వచ్చి అనేక ఉపన్యాసాలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికుల కనీస వేతనం 26000 చేస్తామని అర్హులైన వాళ్ళందరిని పర్మినెంట్ చేస్తామని పని భద్రత కల్పిస్తామని వారి సమస్యలు మొత్తం పరిష్కరిస్తామని ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. ఈరోజు ఒక్కరోజు సమ్మెతో సరిపెట్టామని భవిష్యత్తులో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో నిరవధికసమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మె అనంతరం ర్యాలీగా ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్లి అక్కడ నిరసన తెలియజేసి ఆర్డిఓ గారికి గ్రామపంచాయతీ సమస్యల మీద వినతి పత్రం అందించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ మేము గతంలో జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర కమిషనర్ కి రాష్ట్ర మంత్రి సీతక్క కి అనేక దఫాలుగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చినమని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదని కావున వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలుపుతూ ఇప్పటికైనా కనీస వేతనం 26,000 ఇవ్వాలని పని భద్రత కల్పించాలని అర్హులైన వారిని కార్యదర్శులుగా మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. అదేవిధంగా అందరికీ ఈఎస్ఐ,పిఎఫ్, ఇన్సూరెన్స్, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో గారికి ఇచ్చినమని పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో వ్యాకాస జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి సిఐటియు పట్టణ నాయకులు ఎం నాగరాజు జి లక్ష్మణ్, రామకృష్ణ మురళి ప్రసాద్ గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు చెన్నకేశవులు, శ్రీను, మనోజ్ రెడ్డి, విజయ, భాను , రజనీకాంథ్ తదితరులు పాల్గొన్నారు









