మణుగూరు, ఆగస్టు13(వై 7న్యూస్);
కేంద్ర మాజీ మంత్రివర్యులు ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి 69 వ జన్మదిన వేడుకలు మణుగూరు రేణుకా చౌదరి క్యాంప్ ఆఫీస్ లో అక్షర మహిళా మండలి గ్రూపు సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ జిల్లా నాయకులు గురజాల గోపి హాజరయ్యారు గురజాల గోపి మాట్లాడుతూ రేణుక చౌదరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రేణుక చౌదరి పుట్టినరోజు సందర్భంగా క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేసి బాలల సదనంలో విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూర్గుల నరసయ్య, మైనారిటీ నాయకులు ఎండి షరీఫ్, మహిళా మండలి అధ్యక్షురాలు సరోజ, షబానా, శ్యామల చక్రి, రేణుక, కిషన్ నాయక్, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు
Post Views: 210









